Whiten Your Yellow Teeth:దంతాలు తెల్లగా మెరుస్తూ ఉంటేనే అందం... అలాగే ఆరోగ్యం కూడా. దంతాలు పసుపు రంగులో గార పట్టినట్టు ఉంటే దంత వైద్యులు చుట్టూ తిరుగుతూ వేలకొద్ది డబ్బులను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే పదార్థాలను ఉపయోగించి తెల్లగా మెరిసే దంతాలను సొంతం చేసుకోవచ్చు. అలాగే పళ్ళు దృఢంగా, ఆరోగ్యంగా కూడా ఉంటాయి. మన వంటింట్లో వంటసోడాను వాడుతూ ఉంటాం.
వంటసోడా పసుపు రంగులో గార పట్టిన పళ్ళను తెల్లగా మెరిసేలా చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. వంటసోడాలో నీటిని కలిపి పళ్ళ మీద రాసి రుద్ది కడగాలి. అయితే వారంలో రెండుసార్లు మాత్రమే వంట సోడాను ఉపయోగించాలి. ఎక్కువగా వంటసోడాను ఉపయోగిస్తే పంటి మీద ఎనామిల్ దెబ్బ తినే ప్రమాదం ఉంది.
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది పంటి మీద పసుపు రంగును, గారను తొలగించడానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే పసుపు రంగు గార పట్టిన పళ్ళు తెల్లగా మెరుస్తాయి. అయితే వారంలో రెండు సార్లు మాత్రమే ఈ విధంగా చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


