కంటి కింద ముడతలు వయస్సు ప్రభావాన్ని సూచిస్తాయి. వయస్సు పెరిగే కొద్ది ఈ ముడతలు ఎక్కువ అవుతాయి. అయితే ముడతలు రావటానికి వయస్సు మాత్రమే కాకుండా అనేక సమస్యలు కూడా కారణం కావచ్చు.
మానసిక,శారీరక సమస్యలు,ఒత్తిడి,అనవసరపు ఆందోళన,సరైన పోషకాహారం లేకపోవుట నిద్రలేమి వంటి కారణాల వలన కూడా ముడతలు రావచ్చు. వీటి నివారణకు సౌందర్య సాధనాలు ఉపయోగించటం కన్నా ఇంట్లో దొరికే వస్తువులతో మంచి పలితాన్ని పొందవచ్చు.
రెండు స్పూన్స్ చెరకు రసంలో ఒక స్పూన్ పసుపు కలిపి ముద్దగా చేసుకోని ఒక పావుగంట పాటు పక్కన పెట్టాలి. అనంతరం కంటి కింద,ముడతలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కంటి కింద ముడతలు తగ్గించుకోవటానికి చాలా బాగా పనిచేస్తుంది.
రెండు స్పూన్స్ కొబ్బరి నూనెను స్నానానికి ముందు ముఖం,మెడ ప్రాంతంలో అప్లై చేసి పావుగంట తర్వాత చేయాలి. దీనిని క్రమం తప్పకుండా ప్రతి రోజు చేస్తే ముఖ వర్చసు మరింత పెరిగి ముడతలు తగ్గి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
ప్రతి రోజు ఉదయం లేవగానే ఒక స్పూన్ అల్లం తురుమును రెండు స్పూన్స్ తేనెలో కలుపుకొని త్రాగాలి. అలాగే నీటిని ఎక్కువగా త్రాగటం వలన శరీరంలోని టాక్సిన్ లు బయటకు పోతాయి.
స్నానానికి ముందు కొద్దిగా నిమ్మరసాన్ని ముఖానికి,మెడ,చేతులకు పట్టించి అనంతరం స్నానం చేయాలి. ఇది చర్మాన్ని లోపలి దాకా శుభ్రపరుస్తుంది. అంతేకాక కంటి కింద,మోచేతులు,చేతుల మీద ముడతలను తగ్గిస్తుంది.


