మజ్జిగ చారులో ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిరపకాయ ముక్కలు, తాలింపు వేసుకుంటాము. మనకు తెలిసిందే. ఇది గుజరాతి స్టైల్లో ఎలా ఉందో చూద్దాం. కమ్మని గుజరాతి మజ్జిగ చారుని కూడా టెస్ట్ చేద్దాం
చేసే విధానం:
ఒక కప్పు కమ్మని పెరుగు తీసుకొని, పావు కప్పు శనగపిండి వేసి బాగా కలుపుకోండి .బాగా బీటర్ తో కలుపుకోవాలి. దాంట్లో మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపుకి ఒక పాన్ పెట్టుకోండి.
ఆవాలు ,మెంతులు ముందుగా వేపుకోవాలి. మెంతులు రంగు మారేవరకు వేపితే మంచి smell వస్తుంది . ఆ తర్వాత జీలకర్ర ,ఇంగువ తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన అల్లం తురుము ఒక్క స్పూన్ లేదా అల్లం కారం వేసుకున్న పర్లేదు.
ఈ తాలింపులో మజ్జిగని పోసి కలియపడుతూ ఉండాలి. కొంచెం కొత్తిమీర ,సాల్ట్ వేయాలి. ఇందులో శనగపిండి వేసాం కాబట్టి మనం కలపడం ఆపిన వెంటనే ఉండలు కడుతుంది. జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి.
ఆ తర్వాత ఒక్క ఉడుకు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడు శనగపిండి ఉడికినట్టు.. సమ్మర్ లో రోజు చేసుకున్న ఈ గుజరాతి స్టైల్ కడాయి చాలా చలవ చేస్తుంది.


