Mamidikaya Allam Pachadi: అల్లం పచ్చడి లో మనం చింతపండు వేసుకుంటాం. కానీ చింతపండు వల్ల gastrick problems ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి దాని బదులు మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
గ్యాస్టిక్ సమస్య ఉండదు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని నిల్వ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టిఫిన్స్ లోకి అన్నిట్లోకి కూడా బాగుంటుంది.
కావలసినవి:
100 గ్రాముల అల్లం ,రెండు మామిడికాయలు ,మూడు వెల్లుల్లిపాయలు , బెల్లం ఇంకా పోపు సామాన్లు మెంతులు, ఆవాలు ,ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ.
చేయు విధానం:
100 గ్రాముల అల్లం. 500 గ్రాములు పచ్చి మామిడికాయలు సుమారు రెండు మామిడికాయలు. 100 గ్రాములు వెల్లుల్లిపాయలు అంటే మూడు రావచ్చు. అల్లం ఎంత తీసుకుంటామో దానికి డబల్ బెల్లం తీసుకోవాలి. ఇక్కడ అల్లం 100 గ్రాములు కాబట్టి 200 గ్రాములు బెల్లం తీసుకోవాలి.
మామిడికాయ చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి .సుమారు మూడు కప్పులు ముక్కలు వస్తాయి. అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోండి .ముప్పావు కప్పు ముక్కలు వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి ,వేపుకోవాలి.
మెంతులు బాగా ఎర్రగా వేయించుకోవాలి, లేదంటే చేదు వస్తుంది .ఎప్పుడూ కూడా మెంతులు రెడ్ కలర్ రావాలి. తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగించండి.
ఒక కప్పు కరివేపాకు కడిగి ఆరబెట్టింది వేగించుకోండి .అవి అలా పక్కన పెట్టి ,మళ్ళీ వేరే పాన్ లో ఒక స్పూన్ నూనె వేసుకొని ,అల్లం ముక్కలు వేసుకొని, కొంచెం ముక్కలు ముడతగా వచ్చేసరికి వాటిని తీసి పక్కన పెట్టుకొని, మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టి వేగించుకోవాలి.
కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఈ ముక్కలు, ధనియాలు, మెంతులు ఇవన్నీ చల్లారే లోపు, పోపు కూడా పెట్టేసుకోవచ్చు. పక్కన పాన్లో రెండు స్పూన్లు నూనె వేసుకొని ,రెండు రెండు టీ స్పూన్ల పచ్చి శనగపప్పు ,రెండు టీ స్పూన్ల మినప గుళ్ళు, ఒక టీస్పూన్ ఆవాలు వేసి, లో ఫ్లేమ్ లోనే మాడకుండా వేగించుకోండి .
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నాలుగు 15 వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండు మిరపకాయ ముక్కలు ,ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు వేసి పక్కను ఉంచుకోండి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపిన ధనియాలు, మెంతులు మిశ్రమాన్ని మిక్స్ చేసుకోండి . తర్వాత అల్లం ముక్కలు వేసేటప్పుడే కొంచెం ఐదు స్పూన్లు ఉప్పు వేసుకోవచ్చు.
సాల్ట్ ఒక ఐదు స్పూన్లు మధ్య మధ్యలో వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది. మామిడికాయ ముక్కలు వేసినప్పుడు, అల్లం ముక్కలు వేసినప్పుడు, వెల్లుల్లిపాయలు వేసినప్పుడు అలా ఐదు స్పూన్లు పూర్తి చేసుకుంటూ తిప్పడం వల్ల స్మూత్ గా పేస్ట్ అవుతుంది.
ఒక బౌల్ లో వేసుకుంటూ అల్లం మామిడి పేస్టు , ఆవాలు మెంతులు పౌడర్, వెల్లుల్లి పేస్టు ,అరకప్పు కారం ,200 గ్రాముల బెల్లం తురుము, ఒక టీ స్పూన్ పసుపు ,అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం కొంచెం తీసి మిక్సీ జార్ లో వేసుకుంటే ఇంకా గట్టిగా ఉన్నట్లయితే కాచి చల్లార్చిన నీరుని కలుపుకోండి, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు. ఒక కంటైనర్ లో పెట్టుకొని మనం కొంచెం కొంచెం వేసుకోవచ్చు.


