Gongura Pandu Mirapakaya Pachadi:గోంగూర పచ్చడి ఇలా పండుమిర్చివేసిచేస్తే రుచి అదిరిపోతుంది

Gongura Pandu Mirapakaya Pachadi: పండుమిరపకాయలు వచ్చే సీజన్లో పండు మిర్చి పచ్చడి తినాలనిపిస్తుంది. కానీ ఒక్క పండుమిర్చి తిన్నప్పుడు గుండెల్లో మంట కూడా వస్తుంది. 

సో దాన్ని వేరే కాంబినేషన్ తో టమాటోలో గాని గోంగూర పచ్చడిలో గాని కలుపుకుంటే అటు మిర్చి flavour ఉంటుంది. ఇటు ఘాటు తగ్గుతుంది. రుచికి రుచి తగులుతూ ఉంటుంది. ఇలా కూడా ట్రై చేసి చూడండి.

కావలసినవి:
పది గోంగూర కట్టలు, పావుకిలో పండుమిర్చి, చింతపండు ,ఉప్పు, వెల్లుల్లి రేకలు, కరివేపాకు ,పోపు దినుసులు.

చేయు విధానం:
పది గోంగూర కట్టలు , సుమారు 400 గ్రాములు ఆకు వస్తుంది. కట్టను బట్టి కొంచెం మనకి ఎక్కువ తక్కువ వస్తాయి. ఆకుకూరల్లో ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువగా తీసుకొని ,ఉప్పు వేసి బాగా శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగి పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి.

పావు కిలో పండుమిర్చి కూడా తీసుకొని తడి బట్టతో శుభ్రంగా తుడుచుకొని, ఆరబెట్టుకోవాలి. 20 గ్రాముల చింతపండు, 75 గ్రాముల కల్లుప్పు ఇవన్నీ పక్కన పెట్టుకొని . స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టి, దాంట్లో పావు కప్పు అంటే సుమారు 50 ml నూనె పోసుకోవాలి .

నూనె కాగిన తర్వాత గోంగూర ఒకేసారి బాణీకి సరిపడా వేసుకోండి. low to medium ఫ్లేమ్ లో ఆకుని శుభ్రంగా కలిసేలాగా , అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి .అది కొంచెం చల్లారేలోపు, ఒక మిక్సీ జార్ లో కల్లుప్పు, చింతపండు ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే అది కొంచెం క్రిస్పీగా వస్తుంది. తర్వాత పండు మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి అవి కూడా జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి.

20 వెల్లుల్లి రేకలు, వేయించిన మెంతుల పొడి 5 గ్రాములు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. పావు స్పూన్ పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేలా చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో చల్లారిన గోంగూరని కొంచెం కొంచెం వేసుకొని కచ్చా పచ్చా గా grind చేసుకోండి.

ఇది ఒక గ్లాస్ కంటైనర్ లో పెట్టుకుంటే ఒక్క సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది .ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకొని పోపు పెట్టుకుంటే చూడ్డానికి కలర్ ఫుల్ గా ఉంటుంది.

ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి కావలసినవి - పావుకప్పు నూనె, ఆఫ్ స్పూన్ ఆవాలు , అర స్పూన్ పచ్చనగపప్పు, స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నూనెలో ఒక రెండు ఎండు మిరపకాయ ముక్కలు ,నాలుగు ఐదు వెల్లుల్లి రేఖలు కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి .ఇందులో ఒక కప్పు పచ్చడి తీసి కలుపుకుంటే చక్కగా నూనె తేలుతూ పచ్చడి నోరూరుతూ ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top