Oats Dosa Recipe:ఓట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఓట్స్ ముఖ్యంగా బరువు తగ్గటానికి చాలా బాగా సహాయపడతాయి. ఓట్స్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఓట్స్ దోశ ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు
1 కప్పు వోట్స్
1 కప్పు బియ్యం పిండి
¼ కప్పు బొంబాయి రవ్వ
1 స్పూన్ ఉప్పు
½ ఉల్లిపాయ (సన్నగా తరిగినవి)
2 మిరపకాయలు (సన్నగా తరిగినవి)
2 టేబుల్ స్పూన్ కొత్తిమీర (సన్నగా తరిగినవి)
2 టేబుల్ స్పూన్లు కరివేపాకు (తరిగినవి)
1 tsp జీలకర్ర
4 కప్పు నీరు
తయారి విధానం
పొయ్యి మీద పాన్ పెట్టి ఒక కప్పు ఓట్స్ వేసి డ్రై రోస్ట్ చేయాలి. వేగించిన ఓట్స్ ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేయాలి. ఒక బౌల్ లో ఒక కప్పు ఓట్స్ పొడి,ఒక కప్పు బియ్యం పిండి,¼ కప్పు రవ్వ మరియు 1 స్పూన్ ఉప్పు వేసి 4 కప్పుల నీటిని పోసి బాగా కలపాలి.
ఆ తర్వాత ½ ఉల్లిపాయ ముక్కలు , 2పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు మరియు 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలపాలి. 15 నిమిషాల తర్వాత దోశలు వేసుకొని స్పైసీ చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.


