Sujji Laddu:నోట్లో వేసుకుంటే కరిగిపోయే లడ్డు లు ఒక్కొక్కసారి గట్టిగా ఉంటాయి. ఇలా చేసుకుంటే లడ్డులు చాలా మృదువుగా వస్తాయి. పిల్లల పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కి ఎక్కువ ఖర్చు పెట్ట లేనప్పుడు ఈ రవ్వ లడ్డు తో enjoy చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.
కావలసిన పదార్థాలు:
ఒక కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పచ్చి కొబ్బరి తురుము, ముప్పావు కప్పు పంచదార, ఒక్క హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు ఎండు ద్రాక్ష.
చేయు విధానం:
ఒక కప్పు బొంబాయి రవ్వ, సగం కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి, ఒక స్పూన్ తో కానీ చేతితో గాని చక్కగా కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోండి. బాగా కలుపుకొని ఒక రెండు గంటలు వదిలేయాలి .బొంబాయి రవ్వ కొబ్బరి పాలను బాగా పీల్చుకుంటుంది .
ఇలా పీల్చుకున్న బొంబాయి రవ్వ నెయ్యిలో వేయించినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 50 గ్రా నెయ్యి వేడి చేసుకుని పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు ఎండు ద్రాక్ష వేసి బాగా దోరగా వేయించుకోవాలి.
వాటిని పక్కకు తీసిన తర్వాత ఆ మిగిలిన నెయ్యిలో రెండు గంటలు పక్కన బెట్టి ఉంచిన బొంబాయి రవ్వ, కొబ్బరి తురుము మిశ్రమాన్ని వేసి సిమ్ లోనే బాగా దోరగా వేయించుకోవాలి. రవ్వ బాగా వేగిందంటే జీడిపప్పు వేగించిన వాసన వస్తూ ఉంటుంది. ఎంత బాగా ఏగితే అంతా రుచి కూడా వస్తుంది.
మరోపక్క stove on చేసి బాణలిలో ముప్పావు కప్పు పంచదార 100 ml నీళ్లు పోసి లేత పాకం వచ్చే వరకు ఉంచి అందులో ఈ బొంబాయి రవ్వ వేసి బాగా కలిపాలి. చల్లారిన తర్వాత అది కొంచెం గట్టిపడుతుంది. అవి ఉండలు లేకుండా చితిపి మనకి ఎలా కావాలో అలాగా చిన్న సైజు లడ్డు లాగా చుట్టుకోవాలి. ఇదే అసలైన సిసలైన కమ్మని రవ్వలడ్డు ట్రై చేయండి మరి.