Atukula Chekodilu :అటుకులను తప్పకుండా మన డైట్ లో చేర్చాలి. ఎందుకంటే పుష్కలంగా ఐరన్ ఉంటుంది. విటమిన్ ఏ, బి ,సి ,కే ఉంటాయి. గ్లూకోజ్ కానీ ఫ్యాట్ ప్రొడక్ట్స్ కానీ ఉండవు. సో వెయిట్ లాస్, షుగర్ పేషెంట్స్ అందరికీ బాగుంటాయి.
కావలసిన పదార్ధాలు : 1/2 కప్పు అటుకులు, 1/4 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు పొడి బియ్యప్పిండి, 1tbs నెయ్యి లేదా నూనె,1 కప్పు వాటర్, 1 tbs కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 tbs వాము,1 tbs నువ్వులు, 1/4tbs ఇంగువ.
తయారి విధానం
అరకప్పు అటుకులు, పావు కప్పు పుట్నాల పప్పుని ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఒక బౌల్ తీసుకొని దానిని జల్లించి ఒక కప్పు బియ్యప్పిండి ని కూడా అందులో కలిపి మూడింటిని బాగా కలపండి.
ఒక బాండి తీసుకొని పొయ్యిమీద వేడి చేసి నూనె లేకుండా మూడు కలిపిన మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ లో లైట్ గా నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేవరకు రోస్ట్ చేయండి. ఉప్పు, కారం ,నువ్వులు ,వాము ,ఇంగువ అన్ని వేసి బాగా పొడి పొడిగా కలపండి. బియ్యప్పిండి తీసుకున్న కప్పుతోనే వేడి నీళ్లు మరగనివ్వండి.
ఈ మిశ్రమాన్ని వేడినీళ్లతో కలపండి. ముందు ఒక స్పూన్ తో కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. చల్లారిన తర్వాత చేతితో బాగా మెత్తగా ముద్దగా కలపండి. మరీ మెత్తగా ఉండకూడదు. మరీ గట్టిగా ఉండకూడదు. సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి.
ఆ తర్వాత కొంచెం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఒక roll లాగా చేసుకుని రింగ్ లాగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో చేసుకోవాలి. సరిపడా నూనెని తీసుకొని మీడియం ఫ్లేమ్ లో రెండు నిమిషాలు వేగనిచ్చి...ఆ తర్వాత వాటిని తిప్పుతూ వేగించాలి. అంతే కరకరలాడే చెకోడీలు రెడీ.


