Katte Pongali :పొంగల్ అనగానే పండగ స్పెషల్. ముఖ్యంగా గుళ్లో ప్రసాదం ఇలా ఎన్నో రకాల పొంగల్ తెలుసు కదా, అతి సులభముగా కొలతల లో కొన్ని మార్పులు చేస్తే పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. ఈ చిట్కాని తెలుసుకోవాలని ఉందా.
కావలసినవి:
ఒక కప్పు రైస్ అంటే 110 గ్రాములు, ఒక కప్పు పెసరపప్పు ,రెండు పచ్చిమిరపకాయలు ,రెండు స్పూన్ల అల్లం తురుము, మూడు స్పూన్ల జీడిపప్పు, కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ,ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర.
చేసే విధానం:
సోనా మసూరి రైస్ కంటే దోసే రైస్, కర్నూల్ రైస్ లాంటివి బాగుంటాయి. ఎందుకంటే సోనామసూరి ముందు మెత్తగా ఉంటుంది. ఆ తర్వాత పలుకు పలుకుగా అయిపోతుంది. రుచి కూడా ఉండదు. రైస్ ని బాగా కడిగి 30 నిమిషాలు నానబెట్టండి .
ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాండిలో దోరగా సువాసన వచ్చేవరకు వేగించండి. ఇప్పుడు నాలుగు కప్పుల నీళ్లు తీసుకొనీ Boil చేసి అందులో కొంచెం సాల్ట్, కడిగిన బియ్యము ,వేయించిన పెసరపప్పు వేసి మూత పెట్టేయండి. కుక్కర్లో కంటే విడిగా ఉడికినది చాలా టేస్ట్ వస్తుంది.
సిమ్ లో ఉడుకుతూ ఉండగా దగ్గరికి వచ్చేసరికి, పక్కన మళ్లీ ఒక బాండీలో నెయ్యి మీకు ఇష్టమైన అంత వేసుకోవచ్చు.. ఎంత వేసిన అంత రుచి అంత వాసన, అందులో రెండు పచ్చి మిరపకాయలు ,రెండు స్పూన్ల అల్లం తురుము ,కరివేపాకు మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి.
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ,ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, చిటికెడు ఇంగువ వేసి మంచి వాసన వచ్చే వరకు సిమ్ లోనే వేపుకోవాలి. ఉడుకుతున్న పొంగల్ లో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ,ఒక్క నిమిషం మూత పెట్టి, స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి.