పరోటాను ఎన్నో రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటాం. రవ్వ, మొక్కజొన్న పిండితో పరోటా తయారుచేసుకుంటే చాలా రుచిగా ఉండటమే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్థాలు :
రవ్వ - 1 కప్పు
మొక్కజొన్న పిండి -
మెంతికూర - 1/2 కప్పు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 చిన్న చెంచా
నూనె- 1 పెద్ద స్పూన్
నూనె - వేయించటానికి
పెరుగు ¹/4 కప్పు
ఉప్పు - తగినంత.
తయారుచేసే పద్ధతి :
రవ్వ, మొక్కజొన్న పిండిలో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నూనె, మెంతికూర వేసి, అవసరమైనన్ని నీళ్లు పోసి పిండి కలపండి. దీన్ని ఉండలుగా తీసి పరోటాలు చేసి వేడి పెనం మీద ఇరువైపులా కాల్చండి. ఆలూ బఠానీ కూరతో వేడివేడిగా వడ్డించండి. టేస్ట్ సూపర్ గా ఉంటుంది.


