Jonna Vadalu:క్రిస్పీగా జొన్న పిండితో ఉల్లి మసాలా వడలు....టేస్ట్ సూపర్ గా ఉంటుంది

జొన్న వడలు రుచి చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద శ్రద్ద పెరిగి జొన్నలను ఎక్కువగా వాడుతున్నారు. జొన్న పిండితో అట్లు,రొట్టెలు వంటివి చేసుకుంటూ ఉంటాం. ఇలా జొన్న పిండితో వడలు వేసుకుంటే స్నాక్ గా చాలా బాగుంటుంది.

కావలసిన పదార్థాలు :
శనగపిండి - 3/4 కప్పు
జొన్న పిండి - 1 కప్పు
పెరుగు - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 1
వెల్లుల్లి రెబ్బ - 1
అల్లం ముక్క - 1 చిన్నది
సన్నగా తరిగిన పాలకూర - 1 కప్పు
నూనె - వేయించేందుకు
ఉప్పు - తగినంత.

తయారుచేసే పద్ధతి :
ఒక బౌల్లో శనగపిండి, జొన్న పిండి, పెరుగు, ఉప్పు కలపండి. ఇందులో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి పేస్టు చేసి వేయండి. ఆ తర్వాత పాలకూర, 1/2 కప్పు నీళ్లు పోసి పిండిలో బాగా మిక్స్ చేయండి . 

చిన్నచిన్న వడలు చేసి కడాయిలో నూనె వేడయ్యాక వేసి gold కలర్ వచ్చాక టిష్యు పేపర్ మీద వేసి సర్వ్ చేయటమే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top