Dal Makhani:పర్ఫెక్ట్ రెస్టారంట్ స్టైల్ దాల్ మఖానీ..ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది

Dal Makhani: దాల్ మఖానీ పంజాబీ వంట. దీనిని సాదా అన్నం లేదా జీరా రైస్‌, రోటీలు మరియు గార్లిక్ బటర్ నాన్ వంటి వాటితో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ క్రీమీ పప్పు వంటకం భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది.

కావలసినవి
నల్ల మినపప్పు -¾ కప్పు
రాజ్మా - ¼ కప్పు
నీరు - 3 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - 2 స్పూన్స్
పలావ్ ఆకు - 1
పెద్ద టమోటాలు (సన్నగా తరిగినవి) - 2
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
పసుపు - పావు స్పూన్
ఒక పెద్ద ఉల్లిపాయ (సన్నగా తరిగిన)
ధనియాల పొడి - ఒక స్పూన్
జీలకర్ర పొడి - అర స్పూన్
మిరప పొడి = ఒక స్పూన్
రుచికి ఉప్పు
1 కప్పు నీరు (లేదా అవసరమైన విధంగా)
2 టేబుల్ స్పూన్లు తాజా క్రీమ్ (లేదా అవసరమైతే)
కొన్ని కొత్తిమీర ఆకులు (తరిగిన)1 టేబుల్ స్పూన్ నెయ్యి
చిటికెడు ఇంగువ
¾ టీస్పూన్ ఎర్ర కారం పొడి
¼ స్పూన్ గరం మసాలా (ఐచ్ఛికం)

తయారి విధానం
ఒక పెద్ద గిన్నెలో 1 కప్పు నల్ల మినపప్పు మరియు ¼ కప్పు రాజ్మా తీసుకోండి. తగినంత నీరు పోసి రాత్రిపూట లేదా కనీసం 8 గంటలు నానబెట్టాలి. నానిన ఈ పప్పులను కుక్కర్ లో పెట్టి 3 కప్పుల నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించాలి.

ఒక పెద్ద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బే ఆకును ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి రంగు మారే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు వేయించాలి.

ఆ తర్వాత టమోటా వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం మరియు ఉప్పు వేసి ఒక నిమిషం ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించిన పప్పు వేసి బాగా కలపాలి. ఒక కప్పు నీటిని పోసి చిక్కగా మారే వరకు 15 నిమిషాలు ఉడికించాలి.

ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల తాజా క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలపాలి. తడ్కా పాన్ వేడి చేసి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంగువ,కారం, గరం మసాలా వేసి 2-3 సెకన్లు వేగించి దాల్ మఖానీ మీద టెంపరింగ్ పోయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top