Sand Walking Benefits In telugu:తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరిలను కరిగించుకోవాలని అనుకునే వారికీ ఈ శాండ్ వాకింగ్ చాలా మంచిది. ఇసుకలో నడిచేదే శాండ్ వాకింగ్. సముద్ర తీరంలో,నది తీరంలో శాండ్ వాకింగ్ చేసే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది.
తారు రోడ్డు మీద నడవకుండా ఇసుక మీద నడవటం కొంచెం కష్టమైన త్వరగా పలితాన్ని పొందవచ్చు. అయితే ఇలా నడిచేవారు వాకింగ్ షుస్ ఉపయోగించకుండా ఉంటేనే మంచిది. పాదాలతో నడవాలని నిపుణులు చెప్పుతున్నారు.
ఒకసారి శాండ్ వాకింగ్ చేస్తే పేవ్ మెంట్ మీద లేదా మాములు రోడ్డు మీద రెండు సార్లు నడిచిన పలితాన్ని పొందవచ్చు. శాండ్ వాకింగ్ చేసే ముందు ఒకేసారి వేగంగా నడవకూడదు. మొదట ఒకటి,రెండు వారాలు నెమ్మదిగా,ఆ తర్వాత కొద్దిగా వేగం పెంచుకుంటూ పోవాలి.
శాండ్ వాకింగ్ లో మరీ ఎక్కువ వేగంగా నడవకూడదు. రాత్రి సమయంలో శాండ్ వాకింగ్ చేయకుండా ఉంటేనే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. అయితే షుగర్ పేషెంట్స్,గుండెకు సంబందించిన వ్యాధులతో బాధపడేవారు శాండ్ వాకింగ్ చేసే ముందు వైద్యుడిని సంప్రదించాలి. వారి సలహా లేకుండా శాండ్ వాకింగ్ చేయటం మంచిది కాదు.


