రోటి పచ్చడి లాగా పల్లీలతో చట్నీ చేసుకుంటే బాగుంటుంది. Routine గా కూరలే కాకుండా ఇలా variety గా పల్లీలతో చట్నీ చేసుకొని రైస లో తింటే చాలా బాగుంటుంది.
కావలసినవి:
నిమ్మకాయ అంత చింతపండు ,ఒక కప్పు - పల్లీలు, 8 - ఎండుమిరపకాయలు ,1 tbs - ధనియాలు, ఒక టీ స్పూన్ - జీలకర్ర ,వెల్లుల్లి రెబ్బలు - 7, ఒక కప్పు - ఉల్లిపాయ ముక్కలు. రుచికి సరిపడా ఉప్పు.
చేసే విధానం:
ముందుగా ఒక పాన్ లో పల్లీలను వేగించండి .లో ఫ్లేమ్ లో దోరగా వేగించుకోండి. పళ్లెంలో తీసి చల్లార పెట్టుకోండి. చింతపండుని కొంచెం నీళ్లలో వేసి నాన పెట్టుకోండి. అదే పాన్ లో రెండు స్పూన్ల నూనె వేసి ఎండుమిరపకాయలని వేగించండి. అవి కూడా తీసి పక్కన పెట్టండి.
ఇప్పుడు ధనియాలు కొంచెం దోరగా వేగిన తర్వాత జీలకర్ర వేసి రెండు నిమిషాలు వేగిన తర్వాత చల్లారి పెట్టిన పల్లీలను కూడా అందులో వేసుకోవాలి. ముందుగా నూనె లేకుండా వేయించుకున్నాం కదా ..ఈ నూనెలో పల్లీలు వేపితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఎండు మిరపకాయలు, వేపిన ధనియాలు, పల్లీలు మిశ్రమం వెల్లులి రెబ్బలు, నీళ్లు కాకుండా చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి .చింతపండు నీళ్లతోటి కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకోండి.
ఇది మనం రైస్ లో తీసుకుంటే కనుక కొద్దిగా బరకగా ఆడుకుంటే బావుంటుంది. మరీ మెత్తగా కాకుండా చివరిలో తరిగిన ఉల్లి ముక్కలు కొంచెం పెద్దవి వేసి ఒక్క పల్స్ లేదా అలాగా direct గా కలిపేసుకోండి. ఇది వేడి అన్నంలో రోటి పచ్చడి లాగా తింటే చాలా బాగుంటుంది. పోపు కూడా అవసరం లేదు.