వాతావరణంలో పెరిగిపోయిన కాలుష్యం, ఒత్తిడి, జుట్టుకు సరైన పోషణ లేకపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనబడుతుంది.
జుట్టు రాలే సమస్య కనపడగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే సమస్య కేవలం 15 రోజుల్లోనే తగ్గటం ప్రారంభం అవుతుంది.
రెండు లేదా మూడు ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అలాగే అలోవెరా ఆకుని తీసుకుని శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ని సపరేట్ చేయాలి. ఒక మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు, రెండు స్పూన్ల కలబంద జెల్, కొంచెం కొత్తిమీర, రెండు స్పూన్ల మిరియాల పొడి, పావు స్పూన్ పింక్ salt, చిటికెడు పసుపు, ఒక గ్లాసు నీటిని పోసి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పల్చని వస్త్రం సాయంతో వడగట్టాలి. ఈ జ్యూస్ ను వారంలో రెండు సార్లు తాగితే జుట్టుకు అవసరమైన పోషణ అంది జుట్టు కుదుళ్ళు బలోపేతం అయ్యి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కాబట్టి ఈ డ్రింక్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.