Crispy aloo fry:బంగాళదుంప అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. బంగాళదుంపతో సాదారణంగా వేపుడు చేసుకుంటూ ఉంటాం. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు, ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే క్రిస్పిగా చాలా బాగుంటుంది.
కావలసిన పదార్ధాలు
మసాలా పొడి కోసం:
3 స్పూన్ల పొట్టు మినపప్పు
1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర
ఎండు ఎర్ర మిరపకాయలు
ఫ్రై కోసం
1/2 కేజీ బంగాళదుంపలు
6 టేబుల్ స్పూన్లు నూనె
1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర
3 వెల్లుల్లి రెబ్బలు
2 చిటికెల ఇంగువ
2 రెమ్మలు కరివేపాకు
1/8 టేబుల్ స్పూన్ పసుపు
1/2-1 టేబుల్ స్పూన్ మిరప పొడి
ఉప్పు (రుచికి సరిపడా)
తయారి విధానం
బంగాళదుంపలను తొక్క తీసి శుభ్రంగా కడిగి సమాన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి నీటిని పోసి 15 నిమిషాలు అలా వదిలేయాలి. పాన్ లో ఒక స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర,ఎండుమిరపకాయలు,మినప్పును వేసి వేగించి మెత్తని పొడిగా చేసుకోవాలి.
బంగాళదుంప ముక్కలను నీటిలో వేసి పొయ్యి మీద పెట్టి అంచులు నురుగు వచ్చేవరకు ఉంచాలి. ఆ తర్వాత బంగాళదుంప ముక్కలను చల్లారపెట్టాలి.. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి నూనె వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు వేసి వేగించాలి.
ఆ తర్వాత చల్లారిన బంగాళదుంప ముక్కలను వేసి నూనెతోబాగా కోట్ చేయాలి. బంగాళదుంపను మీడియం మంట మీద ఉడికించాలి. బంగాళదుంపలు తరచుగా తిప్పుతూ కరకరలాడే వరకు వేగించాలి .బంగాళదుంప ముక్కలు గోల్డ్ కలర్ లోకి వచ్చాక పసుపు, కారం,ఉప్పు,మసాలా పొడి వేసి బాగా కలపాలి.


