Onion Chutney Recipe:ఉల్లిపాయ చెట్నీ దాదాపుగా మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఉల్లిపాయ ఘాటుగా ఉంటుంది. కానీ ఉల్లిపయతో చేసే ఈ చెట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఈ చెట్నీ ఒక్కసారి చేసుకుంటే మూడు నెలల పాటు తినవచ్చు.
కావలసిన పదార్ధాలు
చట్నీ కోసం:
4 ఎర్ర ఉల్లిపాయలు (ముక్కలుగా చేసి)
10 ఎండు మిరపకాయలు
2 టేబుల్ స్పూన్లు నూనె
½ టేబుల్ స్పూన్ మినపప్పు
½ టేబుల్ స్పూన్ శనగపప్పు
1 tsp జీలకర్ర
¼ స్పూన్ మెంతులు
10 వెల్లుల్లి రెబ్బలు
½ స్పూన్ ఉప్పు
చిన్న నిమ్మకాయంత చింతపండు
తాలింపు కోసం:
¼ కప్పు నూనె
1 స్పూన్ ఆవాలు
½ స్పూన్ మినపప్పు
చిటికెడు ఇంగువ
కొన్ని కరివేపాకు
1 స్పూన్ బెల్లం
½ స్పూన్ ఉప్పు
తయారి విధానం
ముందుగా 10 ఎండు మిరపకాయలను వేడి నీటిలో వేసి 10 నిమిషాలు నానబెట్టాలి. ఒక పెద్ద పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ½ టేబుల్ స్పూన్ మినపప్పు , ½ టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 tsp జీలకర్ర మరియు ¼ tsp మెంతులు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి.
ఆ తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేయించాలి. ఆ తర్వాత 4 ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ కొద్దిగా మెత్తపడే వరకు వేయించాలి. అలాగే, ½ tsp ఉప్పు వేసి ఉల్లిపాయ కొద్దిగా రంగు మారే వరకు వేగించాలి.
నానబెట్టిన ఎండు మిరపకాయ , చింతపండు వేసి 2 నిమిషాలు వేయించాలి. పూర్తిగా చల్లార్చి, నీరు కలపకుండా మెత్తని పేస్ట్‌గా రుబ్బుకొని పక్కన పెట్టండి. పెద్ద పాన్‌లో ¼ కప్పు నూనె వేడి చేయండి. 1 tsp ఆవాలు, ½ tsp మినపప్పు , చిటికెడు ఇంగువ మరియు కరివేపాకు వేసి వేగించి
సిద్ధం చేసిన ఉల్లిపాయ చట్నీలో పోసి 2 నిమిషాలు వేగించాలి.
1 tsp బెల్లం మరియు ½ tsp ఉప్పు వేసి పాన్ నుండి నూనె విడిపోయే వరకు ఉడికించాలి. చివరగా, ఇడ్లీ, దోస, అన్నం లేదా రోటీతో ఉల్లిపాయ చట్నీని తింటే రుచి చాలా బాగుంటుంది.


