Grapes Side Effects: ద్రాక్ష తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ద్రాక్షను ఎక్కువ మోతాదులో తీసుకుంటే అనేక నష్టాలు కూడా కలుగుతాయి. ద్రాక్షను ఎక్కువగా తీసుకుంటే కిడ్నీకి సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పరిమితంగానే తీసుకోవాలి.
అయితే ద్రాక్ష పండ్లను ఎక్కువగా తింటే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. ద్రాక్ష పండ్లు చాలా తీయగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ క్యాలరీలు బరువు పెరగడానికి సహాయపడతాయి. అందువల్ల ద్రాక్షను ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.
ద్రాక్షను ఎక్కువగా తీసుకుంటే విరోచనాలు వచ్చే ప్రమాదం ఉంది. పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కడుపు పురం సమస్య ఉన్నప్పుడు ద్రాక్షను తీసుకోకుండా ఉంటేనే మంచిది. కిడ్నీ సమస్యలు, డయాబెటిస్ ఉన్నవారు ద్రాక్షను ఎక్కువగా తినకూడదు. ఇది కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
అలాగే డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి ద్రాక్ష పండ్లను తక్కువ పరిమాణంలో తీసుకోవటం మంచిది. అలర్జీ సమస్య ఉన్నవారు కూడా ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండాలి. అలర్జీ సమస్యలను పెంచుతుంది.
అలర్జీ ఉన్నవారు ద్రాక్ష పండ్లను తింటే ముఖంపై దురద, దద్దుర్లు, వాపులు వస్తాయి. గర్భధారణ సమయంలో కూడా లిమిట్ గా తీసుకోవాలి .ఎక్కువగా తినటం వలన గర్భధారణ సమయంలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే పుట్టబోయే బిడ్డకు ప్యాంక్రియాటిక్ సమస్యలు కనిపిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.