Curd With Salt: ఉప్పు అనేది ఆహారం యొక్క రుచిని మారుస్తుంది. ఉప్పును తగిన మోతాదులో తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. పెరుగులో చిటికెడు ఉప్పు కలిపి రాత్రి సమయంలో తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.
ఈ విధంగా తీసుకోవటం వలన జీర్ణక్రియ బాగుంటుంది. చాలా మందికి పెరుగు అన్నం తినకపోతే భోజనం పూర్తి చేసిన భావన ఉండదు. పెరుగులో విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
పెరుగులో ఉప్పు లేదా పంచదార కలుపుకొని తింటూ ఉంటారు. అయితే పెరుగులో ఉప్పు లేదా పంచదార ఏది తింటే మంచిదో తెలుసుకుందాం. పెరుగు ఎసిడిక్ కాబట్టి పెరుగుతో పాటు ఉప్పు కలిపి తీసుకోకూడదు.
పెరుగులో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చే మంచి బ్యాక్టీరియా. మితంగా తింటే పెరుగు చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారం. అలానే అధిక ఉప్పు అనారోగ్యకరమైనది, ముఖ్యంగా హై బీపీ ఉన్నవారికి, అందుకే ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవడం మంచిది కాదు.
పెరుగు, ఉప్పు కలిపి తినడం వల్ల జుట్టు నెరిసిపోవడం, చర్మంపై మొటిమలు, జుట్టు రాలడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. పెరుగులో ఉన్న ప్రయోజనాలు పూర్తిగా మన శరీరానికి అందాలంటే పెరుగులో ఏమి కలపకుండా తింటేనే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.