Foxtail millet:వారంలో 2 సార్లు కొర్రలను తింటే ఉహించని ప్రయోజనాలు...ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారికి

Foxtail millet Health Benefits in telugu:ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. కొర్రలు తింటే ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు .ఒకప్పుడు కొర్రలను ఎక్కువగా తినేవారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల కారణంగా మరల తినటం ప్రారంభించారు.

కొర్రలను సాధారణ వరి బియ్యం వండుకున్నట్టుగానే వండుకోవచ్చు. వారంలో రెండు లేదా మూడు సార్లు కొర్రలను తింటూ ఉంటే అధిక బరువు నుంచి బయటపడవచ్చు. కొర్రలు తీపి వగరు రుచిని కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్, మాంసకృతులు, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, పాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తినవచ్చు. కడుపుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. కడుపునొప్పి, మూత్రంలో మంట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను తగ్గించడంలో కొర్రలు చాలా బాగా సహాయపడతాయి. కొర్రలలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణసంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది.

బియ్యం బదులు కొర్రలను తింటే నీరసం,అలసట లేకుండా ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల, అలాగే బి విటమిన్ ఎక్కువగా ఉండటం వలన మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. నాడీ వ్యవస్థ పై సానుకూల ప్రభావాన్ని చూపే విటమిన్ కొర్రలలో సమృద్ధిగా ఉండటం వల్ల నాడీ బలహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది

కొర్రలను అన్నం రూపంలో తీసుకోవచ్చు. లేదంటే కొర్రలను రవ్వ, పిండిగా తయారు చేసుకుని రొట్టెలు, ఉప్మా వంటి వాటిని తయారు చేసుకొని తినవచ్చు, కొర్రలను ఏ రూపంలో తీసుకున్న కొర్రలలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top