Soaked Black Chickpeas : రాత్రి సమయంలో శనగలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి రోజు ఒక స్పూన్ నానిన శనగలను తినవచ్చు. శనగలలో ప్రోటీన్ చాలా సమృద్దిగా ఉంటుంది. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడి రక్తహినత సమస్యను తగ్గిస్తుంది.
నానబెట్టిన శనగలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది,ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మీ శరీరం నుండి అన్ని హానికరమైన టాక్సిన్స్ ను బయటకు పంపి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకం మరియు అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
నానబెట్టిన శనగలలో యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోన్యూట్రియెంట్లు సమృద్దిగా ఉండుట వలన రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించటానికి అవసరమైన ఖనిజాలు కూడా సమృద్దిగా ఉంటాయి.
నల్ల శనగలలో యాంటీఆక్సిడెంట్, పైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంచుతుంది. దాంతో చిరుతిళ్లను అతిగా తినకుండా నిరోదిస్తుంది. దాంతో బరువు తగ్గుటానికి సహాయపడుతుంది.శనగలలో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది పిత్త ఆమ్లాలను బంధించడంలో సహాయపడుతుంది మరియు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
శనగలలో జుట్టు ఆరోగ్యానికి సహాయపడే ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాల యొక్క గొప్ప మూలం. అలాగే, ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతుంది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. తెల్లజుట్టు రాకుండా కాపాడుతుంది.
ఉదయం పరగడుపున తీసుకోవటం వలన రోజంతా హుషారుగా ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మీ రక్తంలో చక్కెర శోషణను నియంత్రిస్తుంది.శనగల్లో ఉండే పిండి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.