Fruit Face Packs:చిన్న వేడుక అయిన పెద్ద వేడుక అయిన మన అందం చముక్కుమనేలా కనపడాలి. దీనికోసం మార్కెట్ లో దొరికే ఫేస్ ప్యాక్స్ ను ఉపయోగించ అవసరం లేదు. మన
ఇంటిలోనే ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు.
మనకు అందుబాటులో ఉండే పండ్లతో ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. అర కప్పు బొప్పాయి గుజ్జులో ఒక స్పూన్ గులాబీ రేకుల పేస్ట్,ఒక స్పూన్ తేనే కలిపి ఆ మిశ్రమాన్ని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి, ఆ తర్వాత ముఖానికి ప్యాక్ వేయాలి. అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అరటి పండు,కీరదోస కలిపి పేస్ట్ చేసి దానిలో కోడిగుడ్డు తెల్లసొన,ఒక స్పూన్ తేనే కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన ముఖంపై ముడుతలు కనపడవు.
అరకప్పు కమలారసంలో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ముల్తాని మట్టి, వెన్న కలిపి ముఖం,మెడ ప్రాంతాలలో ప్యాక్ వేసి ఆరిన తర్వాత శుభ్రం చేయాలి.