Brain Health: మెదడు చురుగ్గా ఉండటం అనేది మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. దాని కోసంకొన్ని అలవాట్లను దూరం చేసుకోవాలి. అలాగే కొన్ని అలవాట్లను పెంచుకోవాలని నిపుణులు చెప్పుతున్నారు.
ఉదయం టిఫిన్ తినటం మానేయటం మంచి పద్దతి కాదు. దీని వలన రక్తంలో చెక్కెర స్థాయిలు పడిపోయి మెదడుకు సరైన పోషకాలు అందవు. దాంతో మెదడు చురుగ్గా పనిచేయదు.
ఆహారం అతిగా తినటం, అలాగే ఆహారం తినటం పూర్తిగా మానేయటం కూడా చేటే. ఆహారం అతిగా తినటం వలన మెదడులోని నాళాలు మొద్దుబారి, మెదడు చురుగ్గా పనిచేయదు.
మన శరీరం మొత్తం మీద ఎక్కువగా ఆక్సిజన్ ను ఉపయోగించుకొనే అవయవం మెదడు. అందుకే వీలైనంత వరకు స్వచ్చమైన గాలినే పిల్చాలి. కాలుష్యంతో నిండిన గాలిని పిల్చితే ఆ కారకాలు మెదడుకు ఆక్సిజన్ చేరకుండా అడ్డుకుంటాయి.
దాంతో మెదడు సామర్ధ్యం దెబ్బతింటుంది. అలాగే నిద్ర కూడా మెదడును శక్తివంతం చేస్తుంది. నిద్ర లేకుండా పనిచేస్తే మెదడులోని కణాలు చచ్చుపడే అవకాశం ఉంది.
కాస్త అనారోగ్యంగా ఉన్నప్పుడు శరీరం సహకరిస్తుందని పనిచేస్తాం. కానీ మనస్సు పని చేయవద్దని సంకేతం ఇస్తే ఆ పని మానేయటమే మంచిది. లేదంటే తీవ్ర అలసటకు,అనారోగ్యానికి గురి అవుతాము.