Shimla Mirch Rice: టేస్టీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ 15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
కావలసిన పదార్ధాలు
బాస్మతిబియ్యం - పావు కేజీ
ఎల్లో క్యాప్సికమ్ - 1
రెడ్‌క్యాప్సికమ్ - 1
గ్రీన్ క్యాప్సికమ్ - 1
స్వీట్‌కార్న్‌గింజలు - కొద్దిగా
మిరియాలపొడి - టీ స్పూన్
ఉప్పు - తగినంత
పచ్చిబఠాణీ - కొద్దిగా
నూనె - 4 టీ స్పూన్లు
బటర్ - 2 టీ స్పూన్లు
అజినమోటో - చిటికెడు
తయారీ విధానం
బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి కొద్దిగా బటర్ వేసి కాగాక తరిగి ఉంచుకున్న ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్‌కార్న్‌గింజలు, పచ్చి బఠానీ వేసి వేగించాలి.
ఆ తర్వాత ఉప్పు,మిరియాల పొడి వేసి కొంతసేపు వేగిన తర్వాత అజినమోటో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించి ఉంచుకున్న అన్నంలో కలపాలి. దీనిని వేడి వేడిగా సర్వ చేస్తేనే బాగుంటుంది.