kadai chole: కడై చోలే.. దాభా స్టైల్ లో చోలే మసాలా కర్రీ.. పూరి లోకి చపాతీ లోకి బాగుంటుంది.. కాస్త ఓపికగా ఇంటిలో చేసుకుంటే చాలా రుచిగా ఉండటమే కాకుండా మంచి ఆరోగ్యం కూడా..
కావాల్సిన పదార్దాలు
కాబూలీ శనగలు - 250 గ్రా.
ఉల్లి తరుగు - 50 గ్రా.
టొమాటో తరుగు - 75 గ్రా.
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను
పుదీనా తరుగు - అరకప్పు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
బిరియానీ ఆకులు - మూడు
పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా.
మిరప్పొడి, చోలేమసాలా, ఆమ్‌చూర్ పౌడర్ - అర టీ స్పూను చొప్పున
గరంమసాలా - పావు టీ స్పూను
ఉప్పు - తగినంత
తయారీ విధానం
ముందురోజు రాత్రి శనగలను నానబెట్టి, మరుసటి రోజు శనగలలో ఉన్న నీరు మొత్తం తీసివేసి కుక్కర్ లో దాదాపు అరగంటసేపు ఉడికించుకోవాలి.
పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక బిరియానీ ఆకు, గరం మసాలా వేసి కొంచెం వేగాక, ఉల్లి పాయ ముక్కలు, పచ్చిమిరప ముక్కలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.
ఆ తర్వాత పసుపు, మిరప్పొడి, చోలేమసాలా, ఆమ్‌చూర్ పౌడర్, పుదినా తరుగు, తగినంత ఉప్పు వేయాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన శనగలలో పావు కప్పు శనగలను మెత్తగా చేసి కలపాలి.
మూడు నాలుగు నిముషాల తరవాత నీరు లేకుండా శనగలు వేసి కలిపాలి. దీనిని ఒక కప్పులోకి తీసుకోని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.