
Peanut Spicy Rice:వేరుసెనగ గుళ్ళు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అన్నం మిగిలిపోయినప్పుడు వేరుశనగలతో రైస్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ పల్లీల రైస్ చల్లారిన తర్వాత కూడా చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు
పావు కప్పు వేరుసెనగపప్పు
పావు కప్పు నువ్వులు
4 ఎండు మిర్చి
పావు కప్పు పచ్చి కొబ్బరి
1 cup ఉడికించిన అన్నం
ఉప్పు
1/4 cup నూనె
1/2 tsp ఆవాలు
1 tsp మినపప్పు
1 tsp సెనగపప్పు
2 రెబ్బలు కరివేపాకు
తయారి విధానం
ముందుగా మూకుడులో వేరుశెనగ గుళ్ళు వేసి లో ఫ్లేమ్ లో మూడు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, నువ్వులు వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.
ఇవి కాస్త చల్లారాక మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పాన్ పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి కొంచెం వేగాక ఉడికించిన అన్నం, ఉప్పు, వేరుశనగల పొడి వేసి బాగా కలిపి పొయ్యి ఆఫ్ చేయాలి. కాస్త చల్లారాక బాక్స్ లో పెట్టండి. చాలా సింపుల్ గా మంచి రుచితో ఉండే Peanut Spicy Rice రెడీ.