Gulabjamun Recipe:పిల్లల్ని షుగర్ బారి నుండి రక్షించే స్వీట్, వాళ్ళని చాక్లెట్స్ కి ఐస్ క్రీమ్స్ ని మరిపించే గులాబ్ జామ్. కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు. బెల్లం లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి గులాబ్ జామ్.
కావలసిన పదార్థాలు
2 cups పచ్చి కొబ్బరి,1 స్పూన్ నెయ్యి,2 స్పూన్ల బొంబాయి రవ్వ, 1/2 cup గోధుమపిండి,1.5 cup కొబ్బరి పాలు,1 cup బెల్లం.
చేసే విధానం:
ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీలో వేసి చిక్కటి పాలు 1 1/2cup వచ్చేలాగా చక్కగా strainer తో వడగట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి రెండు స్పూన్ల బొంబాయి రవ్వ వేసి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ లో లైట్ కలర్ మారే వరకు వేయించాలి.
దానితో పాటు గోధుమపిండి కూడా రెండు మూడు నిమిషాలు లైట్ గా వేయించాలి. అందులోనే కొబ్బరి పాలను పోసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కొబ్బరి పాలలోనే పిండిని బాగా ఉడకనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి పగుళ్లు లేకుండా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వాటిని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి.
మరొకపక్క స్టవ్ మీద ఒకటిన్నర కప్పు వాటర్, ఒక కప్పు బెల్లం వేసి కొంచెం పాకం వచ్చేవరకు మరిగించాలి. కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. రెడీ అయిన సిరప్ చల్లారిన తర్వాత వేడి గులాబ్ జామ్ ని వేసి కలిసేలా కలుపుతూ తీసి పక్కన పెట్టండి.


