మన ప్రకృతిలో ఎన్నో రకాల పండ్లు లభ్యమవుతున్నాయి. సీజన్ లో వచ్చే పండ్లను తీసుకుంటే ఆయా సీజన్లో వచ్చే సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లలో నేరేడు పండు ఒకటి.
నేరేడు పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. మూత్ర సంబంధ సమస్యల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది.
శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకి పంపుతుంది . నీరసం,నిస్సత్తువ ఉన్నప్పుడు నాలుగు నేరేడు పండ్లను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. కీళ్ళనొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కాలేయం పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. జ్వరం ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే వేడి తగ్గుతుంది. రోజుకి రెండు లేదా మూడు పండ్లను తింటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


