సాంబార్ పొడి తో బ్రేక్ ఫాస్ట్ లోకి ఈజీగా పప్పులు ఉడకపెట్టకుండా త్వరగా చేసుకోవచ్చు.
కావలసినవి:
ఆవాలు - అర టీ స్పూన్, జీలకర్ర - అర టీ స్పూన్, కొంచెం మెంతులు, రెండు పచ్చిమిర్చి, రెండు పెద్ద ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ ,కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు ,రెండు పెద్ద టమాటాలు, అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, పావు కప్పు పుట్నాల పప్పు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక టీ స్పూన్ సాంబార్ పొడి ,ధనియాల పొడి, ఒక నిమ్మకాయ రసం , కొత్తిమీర.
చేసే విధానం:
ముందుగా ఒక పాన్ తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర ,మెంతులు, ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి అది కూడా తాలింపులో వేసుకోండి. రెండు పచ్చిమిర్చి కూడా పొడవుగా వేయాలి .ఒక రెండు టమాటాలు పెద్ద ముక్కలు కూడా వేసుకోవాలి.
కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కారం, సాంబార్ పొడి , లేకపోతే ధనియాల పొడి వేసి అన్నీ కూడా ఉల్లిపాయలు transparent గా అయ్యేవరకు వేపుకోండి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొబ్బరి ముక్కలు, గుల్ల పప్పు పేస్ట్ చేసుకోండి.
ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ ని కూడా ఉల్లిపాయల్లో వేసుకోండి. మొత్తం అంతా అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. మూడు కప్పుల నీళ్లు పోసి, ఉప్పు, కారం, సాంబార్ పొడి కొంచెం వేసి రుచికి సరిపడా చూసుకోండి.
తర్వాత పల్చదనం చూసుకొని కొంచెం ఉడుకు రానివ్వండి. చింతపండు బదులు ఇక్కడ నిమ్మరసం కూడా వేసి కలపెట్టండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. ఇది instant గా పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు త్వరగా బ్రేక్ ఫాస్ట్ లోకి చేసుకునే రెసిపీ.


