గుమ్మడి గింజలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ , ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్ ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
రోజుకి ఒక స్పూను గుమ్మడి గింజలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గుమ్మడి గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన పొట్ట నిండిన భావన ఎక్కువసేపు ఉండి తినాలనే కోరిక తగ్గి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గుమ్మడి గింజలలో ఉండే జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఈ గింజలను రెగ్యులర్ గా తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. గుమ్మడి గింజల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. గుమ్మడి గింజల్లో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


