Kandi Kobbari pachadi:కొబ్బరి కంది పచ్చడిని ఇలా చేసి చూడండి రుచి చూస్తే వదిలిపెట్టరు

కొబ్బరి కాంబినేషన్స్ లో టమాటో, మామిడికాయ , చింతకాయ , దోసకాయ వేసుకుంటాము. అలా మనకి తెలిసిన కొబ్బరి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి చాలా ఉన్నాయి. అలాగే కంది పచ్చడి లో కూడా కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో అయినా ,ఇడ్లీ, మినప రొట్టి లో కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా చేసేయండి.

కావలసినవి:
కందిపప్పు - 1/2 cup, జీలకర్ర - 1 టీ స్పూన్, ఎండుమిర్చి - 10, కొంచెం చింతపండు, 10 - వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 కొబ్బరి చిప్ప ముక్కలు.

పోపుకి - రెండు స్పూన్ల నూనె, ఒక టీ స్పూన్ మినప గుళ్ళు, అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర ,రెండు ఎండిమిర్చి ,కొంచెం ఇంగువ.

చేసే విధానం:
ఒక పాన్ లో కందిపప్పు దోరగా లో ఫ్లేమ్ లో కమ్మని వాసన వచ్చే వరకు వేపించుకోవాలి. ఒక్క స్పూను జీలకర్ర కూడా వేయండి. స్టవ్ ఆఫ్ చేయండి . తర్వాత వాటిని పక్కన పెట్టి బాండీలో కొద్దిగా నూనె వేసి ఎండు మిరపకాయలు వేయించుకోండి.

వాటిని పక్కన పెట్టి, అదే పాన్లో కొబ్బరి చిప్ప చిన్న చిన్న ముక్కలు చేసుకొని వాటిని కూడా ఒక్కసారి లైట్ గా కలర్ మారేవరకు వేయించుకోవాలి. అవి కూడా పక్కన పెట్టుకోండి. అదే బాండీలో పోపు సామాన్లు వేసుకోండి.

జీలకర్ర ,ఆవాలు, ఎండు మిరపకాయలు, ఇంగువ ,కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన కందిపప్పు, ఎండు మిరపకాయలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి. అందులో మళ్లీ కొబ్బరి ముక్కలు చింతపండు ,వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మరొకసారి గ్రైండ్ చేయండి.

వాటర్ ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి పచ్చడి లాగానే గ్రైండ్ చేయండి. పోపు సామాన్లు వేగిన తర్వాత మిక్సీ పట్టిన పచ్చడిని ఒక్కసారి పోపులో వేసి కల పెట్టండి. చాలా టేస్ట్ గా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top