Idli Manchurian : ఉదయం సమయంలో మనలో చాలా మంది ఇడ్లీ చేసుకుంటారు. ఒక్కోసారి ఇడ్లీ ఎక్కువగా చేసుకున్నప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. మిగిలిన ఇడ్లీలతో మంచూరియా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
కావలసిన పదార్దాలు
ఇడ్లీలు - 8
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
టమోటా సాస్ - 3 స్పూన్స్
ఉల్లికాడల తరుగు - పావుకప్పు
కొత్తిమీర తరుగు - 2 స్పూన్స్
నూనె - 3 స్పూన్స్
ఆవాలు - ఒక స్పూన్
జీలకర్ర - ఒక స్పూన్
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 3 స్పూన్స్
కారం - అర స్పూన్
చిల్లీ సాస్ - అర స్పూన్
సోయా సాస్ - అర స్పూన్
ఉప్పు - సరిపడా
మిరియాల పొడి - చిటికెడు
నిమ్మరసం - కొద్దిగా
తయారి విధానం
ముందుగా ఇడ్లీలను ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి బాణలి పెట్టి రెండు స్పూన్స్ నూనె వేసి ఇడ్లీ ముక్కలను వేసి దోరగా వేగించి విడిగా తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో ఇంకో స్పూన్ నూనె వేసి ఆవాలు,జీలకర్ర వేయాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు,అల్లం,వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
రెండు నిముషాలు అయ్యాక టమోటా సాస్,కారం,తగినంత ఉప్పు,మిరియాలపొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు సోయా సాస్,చిల్లీ సాస్,ఉల్లికాడల తరుగు,వేగించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేయాలి. వీటి అన్నింటిని మొత్తం ఒకసారి బాగా కలిపి కొత్తిమీర చల్లి దించేయాలి. పైన నిమ్మరసం చల్లితే నోరురుంచే ఇడ్లి మంచూరియా సిద్ధం.


