అధిక బరువుకు కొవ్వు కారణం అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ కొన్ని రకాల ఆహార పదార్దాలను తీసుకోవటం ద్వారా శరీరంలో ఉన్న అధిక కొవ్వు కరిగించుకోవచ్చు.
ఆరెంజ్
ఆరెంజ్ పళ్ళను ప్రతి రోజు తీసుకోవటం ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించటానికి ఆరెంజ్ దోహదం చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి శరీరంలో ఉండే అధిక కొవ్వుతో పోరాడుతుంది. భోజనం తర్వాత ఒక ఆరెంజ్ తింటే అధిక కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది.
గ్రీన్ టీ
అసాదారణ రీతిలో కొవ్వును కరిగించే శక్తి గ్రీన్ టీ కి ఉంది. ఇది జీవ ప్రక్రియను మెరుగుపరచి శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగేలా చేస్తుంది. రోజుకి కనీసం ఒక కప్పు గ్రీన్ టీ త్రాగితే కొవ్వు తగ్గుతుంది.
ఓట్ మిల్
గతంలో కన్నా ఇప్పుడు దీన్ని ఆహారంగా తీసుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దీనిలో ఎక్కువ పోషకవిలువలు ఉన్నాయి. దీనిలో పైబర్ కొవ్వును సమర్దవంతముగా ఎదుర్కొంటుంది. రక్తంలో కొలస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజుకి ఒకసారి ఓట్ మిల్ ను తీసుకుంటే శరీరంలో కొవ్వును చాలా బాగా కరిగించుకోవచ్చు.
పాలు
ప్రతి రోజు వెన్న తీసిన రెండు గ్లాసుల పాలు తీసుకుంటే అదిక బరువు,కొవ్వు రెండింటిని తగ్గించుకోవచ్చు. దీనిలోని కాల్షియం జీవ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అందువల్ల కొవ్వు కరుగుతుంది.
పచ్చిమిరపకాయలు
పచ్చిమిరపకాయలలో ఉండే సహజమైన కారం కొవ్వు కరగటానికి దోహదం చేస్తుంది. అందువల్ల వంటలలో ఎండు మిరపకాయలకు బదులు పచ్చిమిరపను వాడమని నిపుణులు సిపార్సు చేస్తున్నారు.
ద్రాక్ష
ద్రాక్ష తినటం ద్వారా అధిక బరువు,కొవ్వును కూడా తగ్గించుకోవచ్చు. దీనిలో ఉండే విటమిన్ సి జీవ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రోజు మొత్తంలో 100 నుంచి 200 గ్రాముల ద్రాక్ష పండ్లను తింటే అనుకున్న పలితాన్ని తొందరగా పొందవచ్చు.


