Bottle Gourd Chapati: ఆనపకాయతో కూర, పప్పు, పులుసు ఇలా ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం. అయితే ఆనపకాయతో చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా బరువు తగ్గడానికి చాలా బాగా సహాయ పడుతుంది. ఈ చపాతీని కాల్చడానికి పెద్దగా నూనె కూడా అవసరం లేదు. గంటల తరబడి మెత్తగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు
2 1/2 cup గోధుమ పిండి
2 cups సొరకాయ తురుముఉప్పు
1/2 tsp గరం మసాలా
1 tsp పచ్చిమిర్చి తరుగు
1/2 tsp మిరియాల పొడి
ఇంగువ – చిటికెడు
నీళ్ళు తగినన్ని
2 tbsp నూనె (పిండిలో కలపడానికి)
నూనె కాల్చుకోడానికి
జీలకర్ర
తయారి విధానం
సొరకాయను శుభ్రంగా కడిగి పై తొక్క తీసి తురుముకోవాలి. గోధుమపిండి తీసుకుని దానిలో గరం మసాలా పొడి, కొత్తిమీర, జీలకర్ర, సొరకాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు,మిరియాల పొడి,ఇంగువ, రెండు స్పూన్ల నూనె, అవసరమైనన్ని నీళ్లు వేసి పిండిని మృదువుగా కలిపి 15 నిమిషాల పాటు వదిలేయాలి.
15 నిమిషాల తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు పిండి ముద్దను తీసుకొని పొడి పిండి జల్లి నెమ్మదిగా ఒత్తుకోవాలి. వత్తుకున్న రొటీని వేడి పెనం మీద వేసి రెండు వైపులా కాల్చి తరువాత tsp నూనె వేసి కాల్చుకుని తీసుకోండి.


