Dahi kebab: రెస్టారెంట్ స్టైల్ దహీ కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే రెస్టారెంట్ కి వెళ్ళకుండా మన ఇంటిలోనే చాలా సులభంగా చేసుకోవచ్చు.
కాస్త సమయాన్ని కేటాయిస్తే ఎంతో రుచికరమైన దహి కబాబ్ తినవచ్చు. బయట కరకరలాడుతూ లోపల వెన్నలా మృదువుగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు
1/2 litre చిక్కని కమ్మని పెరుగు
1 tbsp పచ్చిమిర్చి తురుము
1 tbsp ఉల్లిపాయ సన్నని తరుగు
1/2 tbsp అల్లం సన్నని తురుము
ఉప్పు (కొద్దిగా)
1/2 tbsp చాట్ మసాలా
2-3 tbsp వేపిన సెనగపప్పు పొడి
1/2 Cup పనీర్ తురుము
1/2 Cup ప్రొసెస్డ్ చీస్ తురుము
1 1/2 Cup బ్రేడ్ పొడి
నూనె వేపుకోండి
2 tbsp కొత్తిమీర
తయారి విధానం
ముందుగా కమ్మని పెరుగును బట్టలో వేసి మూట కట్టి వ్రేలాడదీస్తే పెరుగులో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చి పనీర్ వలె గట్టిపడుతుంది. ఈ విధంగా జరగటానికి దాదాపుగా మూడు గంటల సమయం పడుతుంది.
గట్టి పడిన పెరుగులో పచ్చి మిర్చి తురుము,ఉల్లిపాయ ముక్కలు,అల్లం తురుము,ఉప్పు, చాట్ మసాలా, వేపిన శనగపప్పు పొడి,పనీర్ తురుము, చీజ్ తురుము,కొత్తిమీర, అరకప్పు బ్రెడ్ పొడి వేసి బాగా కలపాలి.
పెద్ద నిమ్మకాయంత ఉండ తీసుకుని ఫ్యాటీ మాదిరి వట్టి మిగిలిన బ్రేడ్ పొడిలో నెమ్మదిగా రోల్ చేసుకోండి. బ్రేడ్ పొడి బాగా కోటింగ్ ఇచ్చిన తరువాత ఫ్రిజ్ లో గంట సేపు పెడితే కబాబ్ లు గట్టి పడతాయి. వీటిని నూనెలో మీడియం మంట మీద వేగించాలి. పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటుంది.


