Hotel Style PURI CURRY: పూరి కూరను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తారు. ఇప్పుడు మనం నేర్చుకొనే ఆంధ్ర స్పెషల్ పూరి కూర పక్కా హోటల్ స్టైల్ లో ఉంటుంది. ఈ స్టైల్ లో పూరి కూర చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
2 tsps నూనె
1/2 tsp ఆవాలు
1 tsp శనగపప్పు
1 tsp మినపప్పు
1 tsp జీలకర్ర
1 రెబ్బ కరివేపాకు
2 ఎండు మిర్చి
250 gms పొడవుగా చీరుకున్న ఉల్లిపాయలు
2 పచ్చిమిర్చి
ఉడికించిన చిన్న బంగాళా దుంప
1 tsp అల్లం తరుగు
1 tsp నిమ్మరసం
2 tsp శనగపిండి
1/4 tsp పసుపు
ఉప్పు
1/2 cup నీళ్ళు
1/2 liter కూర ఉడికించడానికి నీళ్ళు
తయారి విధానం
పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు వేసి మూడు నిమిషాల పాటు వేయించాలి.
ఆ తర్వాత అర లీటర్ నీటిని పోసి మూత పెట్టి ఉల్లిపాయ మెత్తబడే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమంలో శనగపిండిలో గడ్డలు లేకుండా నీటిని పోస్తూ బాగా కలిపి పోయాలి. ఒక స్పూన్ అల్లం తరుగు కూడా వెయ్యాలి.
శనగపిండి కూరలో బాగా కలిశాక బంగాళదుంపను మెత్తగా చేసి వేసుకోవాలి. రెండు నిమిషాలు కూర ఉడికాక ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి పొయ్యి మీద నుంచి దించాలి. అంతే strret స్టైల్ పూరి కర్రీ రెడీ.


