Chat Mirchi Method in Telugu:
కావలసిన పదార్థాలు
విత్తనాలు తీసి చీల్చిన మిర్చీలు పెద్దవి
ఉడికించిన బంగాళాదుంప - 1 కప్పు
కారంపొడి- 1/4 చిన్న చెమ్చా
శనగపిండి - 1 కప్పు
పసుపు - '/4 చిన్న చెమ్చా
వాము - 1/4 చిన్న చెమ్చా
చాట్ మసాలా - 1/2 చిన్న చెమ్చా
నూనె - వేయించేందుకు
ఉప్పు - తగినంత.
తయారుచేసే పద్ధతి :
స్టఫింగ్ తయారుచేసేందుకు ప్యాన్ లో కొంచెం నూనె వేడి చేసి గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేయించండి. ఇప్పుడు ఉప్పు, బంగాళాదుంప మెష్ చేసి కలపండి. రెడీ అయిన స్టఫ్ ని ఒకవైపు పెట్టండి. స్టఫింగ్ చల్లారాక మిర్చిల్లో నింపండి.
డిప్ తయారుచేసేందుకు ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, పసుపు, నీళ్లు కలిపి గిలక్కొట్టండి. స్టఫ్ట్ మిర్చీలను డిప్ లో ముంచి వేడి నూనెలో వేయించండి. ముక్కలుగా తరిగి ఛాట్ మసాలా చల్లి సర్వ్ చేయండి.


