Veg Pulao recipe:ఒక్కచుక్క నూనె కూడా లేకుండా వెజ్ పులావ్ ఇలాచేస్తే రుచి అదిరిపోతుంది

బిర్యానీలో చాలా రకాలు చేసుకుంటాము ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకుని రైస్ చేసుకుంటే కొబ్బరి పాలు కూడా health కి మంచిది ,ఆయిల్ లేకుండా కొబ్బరి పాలు వేసుకొని ఈ రైస్ కూడా మనము పాలిష్ లేని రైస్ తీసుకుంటే ఇది మొత్తానికి హాల్దీ food అవుతుంది.

కావలసినవి:
ఒక కప్పు పాలిష్ తక్కువ బియ్యం, కొబ్బరి చిప్ప, ఉల్లిపాయి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యాని సరుకులు, కొత్తిమీర తురుము, జీడిపప్పు.

చేసే విధానం:
రెండు కప్పుల బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి ఒక కప్పు వాటర్ తో నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక ఇంచు దాల్చిన చెక్క, రెండు యాలకులు, రెండు లవంగాలు ,షాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇంకా మీకు మసాలా దినుసులు ఏవి అందుబాటులో ఉంటే అవి పొడిగా వేపుకోవాలి.

రెండు ఉల్లిపాయలు పొడుగ్గా ముక్కలుగా కోసి వేసుకోండి. నాలుగు పచ్చిమిరపకాయలు కూడా అలాగే వేసుకొని, నూనె వేయకుండా ఇవన్నీ పొడిగానే వేపుకోండి. Oil కి బదులుగా మూడు స్పూన్ల పాల మీద మీగడ వేసుకోండి. టేస్ట్ కూడా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి.

ఒకసారి బాగా కలిపి మగ్గుతూ ఉంటాయి మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక సగం కొబ్బరి చిప్పని తీసుకొని ముక్కలుగా కోసి మిక్సీ జార్ లో వేసి కొబ్బరి పాల కోసం గ్రైండ్ చేసుకోండి. అలాగే ఒక కప్పు వేడి నీళ్లు కొంచెం గోరు వెచ్చని నీళ్లు పోయడం వల్ల కొబ్బరి నుంచి కొబ్బరి పాలు త్వరగా తేరుకుంటాయి.

ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినవి లేదో మూత తీసి ఒకసారి చూసుకోండి. దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఐదు నిమిషాల తర్వాత ఈ కొబ్బరిపాలు తేరుకుంటాయి. ఒక క్లాత్ గాని, ఒక జల్లి గిన్నె గాని తీసుకొని ఫిల్టర్ చేసుకోండి .అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో కట్ చేసిన వెజిటేబుల్స్ బంగాళదుంపలు, క్యారెట్, బటాని, పచ్చిమిర్చి అవి కూడా వేసుకోండి.

ఒక మీడియం సైజ్ టొమాటో కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు , జీడిపప్పు ,కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలుపుకొని సిమ్ లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని మూత పెట్టేయండి. ఇప్పుడు కొంచెం టమాటో ముక్కలు మెత్త పడతాయి.

ఇప్పుడు మూత తీసేసి నాలుగు కప్పులు కొబ్బరి పాలను పోసుకోండి. మనం బియ్యం రెండు కప్పులు తీసుకున్నాం కదా ఒక కప్పు బియ్యం కి రెండు కప్పులు పాలు పోసుకోండి .పాలు మరుగుతూ ఉండగా నానబెట్టుకున్న బియ్యం కూడా అందులో వేసుకొని బాగా కలపండి. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని, మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేలాగా కుక్కర్ మూత పెట్టేసుకోండి.

తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం కలపండి. చక్కగా ఉడికి fresh గా పొడిగా ఉంటుంది. ఇందులో కొబ్బరి పాలు పోయడం వల్ల కొబ్బరిలో ఉండే ఆయిల్ తో మనం ఉడికించేసాం కాబట్టి ఆయిల్ పోయినవసరం లేదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top