ఇప్పటి వరకు నిద్రలేమి వలన కలిగే నష్టాల గురించి మాత్రమే మనఅందరికి తెలుసు. అతి నిద్ర వలన కూడా చాలా నష్టాలు ఉంటాయని నిపుణులు చెప్పుతున్నారు. సాదారణంగా ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు గాడనిద్ర ఉంటే సరిపోతుంది. అలా కాకుండా ఎనిమిది గంటలు మించి నిద్రపోతే దాన్ని అతి నిద్ర కింద పరిగణించాలి.
అతి నిద్ర కారణంగా చురుకుగా లేకపోవటంతో పాటు రోజువారీ పనులకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. కండరాలకు పూర్తి విశ్రాంతి లభించి శారీరక శ్రమ తగ్గుతుంది. దీని కారణంగా అనేక అరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక శారీరక,మానసిక అసమానతలకు దారి తీస్తుంది. అయితే దీన్ని అదికమించటానికి కొన్ని సూచనలను పాటించాలి.
రాత్రి పడుకోబోయే ముందు ఒక కప్పు వేడి కాఫీ త్రాగితే తొందరగా లేవటానికి సహాయపడుతుంది. అయితే కాఫీ త్రాగే ముందు డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది.
మధ్యాహ్న సమయంలో కొంత సేపు నిద్రపోవటం అలవాటు చేసుకుంటే రాత్రి సమయంలో ఎక్కువసేపు నిద్రపోయే అలవాటు నుంచి తప్పించుకోవచ్చు.
రోజులో కొద్దిసేపైన వ్యాయామం చచేయుట ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు అతి నిద్ర నుండి కూడా తప్పించుకోవచ్చు.
రాత్రి భోజనం సాధ్యమైనంత తొందరగా ముగించాలి. పడుకోవటానికి మూడు గంటల ముందు భోజనం పూర్తి చేసి,అనంతరం కొద్ది సేపు వాకింగ్ చేస్తే అతి నిద్ర నుండి తప్పించుకోవచ్చు.
సెల్ ఫోన్ లో అలారం పెట్టుకొని త్వరగా లేవటం అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజుల పాటు ఈ విధంగా చేస్తే త్వరగా లేవటం అలవాటు అవుతుంది.
చల్లని నీటితో స్నానం చేసి మనసుకు హాయిని కలిగించే సంగీతాన్ని వింటే కూడా ఈ సమస్యను ఆదికమించవచ్చు.


