కాకినాడ గొట్టం కాజా (కోటయ్య కాజా) ను ఒకసారి తింటే అసలు వదిలిపెట్టకుండా తింటారు. రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కాజాను ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలసిన పదార్దములు :మైదా : పావుకేజీ
రవ్వ : రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
వంటసోడా : అర టీ స్పూన్
పంచదార : అర కేజీ
నూనె : అర కేజీ
ఉప్పు : చిటికెడు
తయారివిధానం
మైదా పిండిని జల్లించి,దానిలో కరిగించిన నెయ్యి,వంట సోడా,రవ్వ,ఉప్పు వేసి కొంచెం నీరు పోసి ముద్దలా అంటే చపాతీ పిండిలా(గట్టిగా కలపకూడదు) కలపాలి. దీనిని ఒక గంట నాననివ్వాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి,దాని మీదఒక గిన్నె పెట్టి దానిలో పంచదార,నీరు పోసి పాకం పట్టాలి. ఈ పాకం తీగ పాకం వస్తే సరిపోతుంది.
ఇప్పుడు వేరే పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోయాలి. నూనె కాగే లోపు మైదా ముద్దను ఒక పీట మీద కొంచెం పిండి వేసి సన్నగా పొడవుగా స్టిక్ మాదిరిగా చేయాలి. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు వైపులా బొటనవేలు తో నొక్కి నూనెలో వేసి తక్కువ మంటతో గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.
వీటిని పైన తయారుచేసుకున్న పాకంలో వేసి గరిటతో నొక్కి 5 నిముషాలు ఉంచితే కాజాలు పాకం బాగా పీల్చుకుంటాయి. ఈ విధంగా చేయుట వలన కాజాలోపల పాకం ఉండి తినేటప్పుడు చాలా బాగుంటుంది.


