Egg Kurma:రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కుర్మా ఇంట్లోనే....ఇలాచేస్తే అన్నం,చపాతీలోకి Super గా ఉంటుంది

Egg Kurma:రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కుర్మా ఇంట్లోనే....ఇలాచేస్తే అన్నం,చపాతీలోకి Super గా ఉంటుంది

కావలసిన పదార్దాలు
కోడిగుడ్లు - 5(ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు - 2
టొమాటో - 1 (పెద్దది)
అల్లం, వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్
కారం - టీ స్పూన్
పసుపు - పావు టీ స్పూన్
ధనియాలపొడి - టీ స్పూన్
ఉప్పు - సరిపడా
కరివేపాకు - రెండు రెబ్బలు
పుదీనా - కొన్ని ఆకులు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - గార్నిష్‌కి సరిపడా

మసాలా పేస్ట్ కోసం:
సోంపు - అర టీ స్పూన్
గసగసాలు - టీ స్పూన్
దాల్చినచెక్క - 1
లవంగాలు - 2
ఏలకులు - 2
జీడిపప్పు - 6

తయారి విధానం
ముందుగా పొయ్యి మీద బాండి పెట్టి సోంపు, గసగసాలు, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, జీడిపప్పు వేసి, వీటి అన్నింటిని నూనె లేకుండా రెండు నిముషాలు వేగించి పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు వేరొక బాండి పెట్టి నూనె పోసి అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి లేత ఎరుపు రంగు వచ్చేవరకు వేగించి,దానికి అల్లం, వెల్లుల్లి ముద్ద,కరివేపాకు,పుదినా వేసి మూడు నిముషాలు వేగించాలి. ఇప్పుడు దానిలో ధనియాలపొడి, కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి రెండు నిముషాలు వేగించాలి.

తర్వాత దీనిలో పైన తయారుచేసుకున్న మసాలా ముద్ద వేసి మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత కోడిగుడ్లు,రెండు కప్పుల నీరు పోసి మూత పెట్టాలి. కొంచెం ఆ మిశ్రమము దగ్గర అయ్యే వరకు ఉంచి దించేయాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఘుమ ఘుమలాడే ఎగ్ కుర్మా రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top