పెద్దవాళ్ళ దగ్గరకి,పేషంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బత్తాయిని తీసుకువెళ్ళతాము. దాదాపు సంవత్సరం మొత్తం దొరికే పండ్లలో ఒకటిగా ఉంది. చక్కెర లేకుండానే దీనిని జ్యూస్ గా త్రాగవచ్చు.
బత్తాయిలో విటమిన్ సి ఎక్కువగా లభించటమే కాకుండా కాపర్,ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. దీన్ని స్వీట్ లెమన్ జ్యూస్ అని కూడా అంటారు. దీనిలో రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
స్కర్వి రాకుండా
చాలా మందికి పెదవుల చివర పుండులా(స్కర్వి) వస్తుంది. విటమిన్ సి తగినంత తీసుకోనప్పుడు ఇది వస్తుంది. దీని నివారణకు బత్తాయి రసం బాగా పనిచేస్తుంది. బత్తాయి రసం తరచూ తీసుకోవటం ద్వారా ఇది రాకుండా జాగ్రత్త పడవచ్చు.
అరుగుదలకు
ఆహారం అరుగుదలకు బత్తాయి రసం దోహదం చేస్తుంది. ఆహారం తీసుకున్న వెంటనే ఒక గ్లాస్ బత్తాయి రసం తీసుకుంటే మంచిది. దీనిలోని ప్లావనాయిడ్స్ ఆహారం జీర్ణం కావటానికి సహాయపడతాయి. అదే విధంగా విరేచనం సాఫీగా అయేటట్టు చేస్తుంది.
డయేరియా నివారణకు
నీళ్ళ విరేచనాలు అవుతూ ఉంటే బత్తాయి రసంతో చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా వాంతులు అవుతున్నప్పుడు కూడా బత్తాయిని పండుగా లేదా రసం రూపంలో గాని తీసుకుంటే మంచి పలితం కనపడుతుంది.
రోగనిరోదకశక్తి పెరుగుదలకు
బత్తాయి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వలన రోగనిరోదకశక్తి పెరుగుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే రక్త ప్రసరణను క్రమపరుస్తుంది.
చర్మ సౌందర్యానికి
చర్మం మీద వచ్చే మచ్చలను బత్తాయి అడ్డుకుంటుంది. ప్రతి రోజు బత్తాయి రసం తీసుకోవటం వలన చర్మం నిగారింపు పెరగటంతో పాటు చర్మం మీద వచ్చే ముడతలను నివారిస్తుంది. చర్మ సంబంద వ్యాదులకు మందులా పనిచేస్తుంది.


