Batani Chaat recipe:బండి మీద అమ్మే బఠాణి చాట్ ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూడండి

బఠాణి చాట్ - స్ట్రీట్ స్టైల్ లో ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకొని హల్దీగా తినొచ్చు ఎలాగో చూసేద్దాం.

కావలసినవి:
బఠాణి - ఒక కప్పు, water - రెండు కప్పులు , oil - రెండు టేబుల్ స్పూన్ల , వెన్న - ఆఫ్ టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ పెద్దది - ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, మీడియం సైజ్ టొమాటో - ఒకటి, పసుపు పావు టీ స్పూన్, కారం అర స్పూన్, ధనియాల పొడి అర స్పూన్, జీలకర్ర పొడి పావు స్పూన్, గరం మసాలా పావు టీ స్పూన్, చాట్ మసాలా పావు టీ స్పూన్, నిమ్మకాయ సగం చెక్క.

చేసే విధానం:
బఠాణిని రాత్రి అంతా శుభ్రంగా కడిగి నీళ్లలో నానబెట్టుకోండి, సుమారు ఎనిమిది గంటల పాటైన నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లు పోసుకుని, కొంచెం పసుపు, లైట్ గా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బఠాణిని కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోండి. ఉడికించిన బఠాణిని లైట్ గా స్మాష్ చేసుకోండి.

మరీ మెత్తగా చేయకూడదు .ఆ వాటర్ లోనే అలాగా ఒకసారి మెదుపుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసి వెన్న కూడా వేసి ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలి.

ఉల్లిపాయలు transparent గా వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ వేపుకోండి. టమాటా ని ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ని కూడా ఆ ఉల్లిపాయల్లో వేసుకోండి. టమాటో మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. 

ఇందులో కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి ,జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి.ఇప్పుడు మెదిపి పెట్టుకున్న బఠానీ వాటర్ తో సహా పాన్లో పోసేసుకోవాలి .ఇంకొంచెం వాటర్ కూడా పడితే పొయ్యొచ్చు .

ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోండి .మూత పెట్టి బాగా ఉడికితే బఠానికి ఈ మసాలాలన్నీ బాగా పడతాయి. మరీ చిక్కగా ఉండకూడదు.మసాలాలు కూడా చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర సగం నిమ్మకాయ రసం పిండుకోండి. 

స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు బండి మీద తినె బటాని చాట్ లాగా తయారైపోయింది టేస్టీ టేస్టీగా వేడివేడిగా బటాని చాట్ తో ఎంజాయ్ చేయండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top