Poha Cutlet: తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో సింపుల్ ఇంగ్రిడియంట్స్ తో ఈజీగా చేసుకునే స్నాక్స్ పోహ కట్లెట్ .హెల్దీ solid స్నాక్ కూడా. గెస్ట్ లు వచ్చినప్పుడు unplanned గా ఉన్నప్పుడు ఈ స్నాక్ ఈజీగా చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
ఒక కప్పు కడిగిన అటుకులు, మూడు మీడియం సైజు బంగాళదుంపలు ఉడికించినవి, రెండు ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తురుము, అర టీ స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ చాట్ మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, రెండు స్పూన్ల మైదా లేక బియ్యప్పిండి.
చేయు విధానం:
ఈ రెసిపీ కోసం సన్నవైనా లావు వైనా అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అవి నానె లోపు బంగాళదుంపల్ని సగానికి కట్ చేసుకుని ఒక గ్లాసు నీళ్లు పోసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
నానబెట్టిన అటుకులను చేతితో బాగా నలిపి బంగాళాదుంపలు చల్లారినవి తీసుకొని గ్రేటర్ తో తురిమి smash చేస్తే ఉండలు ఉండలుగా ఉంటుంది. కాబట్టి తురిమితే చక్కగా ఉంటుంది. అందులోనే కారం, కొత్తిమీర తరుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లులి పేస్ట్ ,ఉప్పు ,మసాలా పొడి, అర స్పూన్ గరం మసాలా ,ఒక స్పూన్ జీలకర్ర లేక జీలకర్ర పొడి వేసి పిండి ముద్దలా వచ్చేవరకు smooth గా కలపండి.
చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని కట్లెట్స్ లాగా అంచులు సరిచేసుకుంటూ క్రాక్స్ లేకుండా చూసుకుంటూ వాటిని ప్రిపేర్ చేసుకోవాలి. రెండు స్పూన్లు మైదా లేక బియ్యప్పిండిలో కొంచెం ఉప్పు కొంచెం నీరు పోసి చిక్కగా కాకుండా కట్లెట్ తడిచే consistencyలో చేసుకోవాలి. అందులో ఈ కట్లెట్స్ ఒక్కొక్కటి వేసి అవి పూర్తిగా అటు ఇటు తడిచేలా ఒక స్పూనుతో turn చేస్తూ వాటిని డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి.
ఇవి క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం బ్రెడ్ క్రంచెస్ లేదా కార్న్ ఫ్లెక్స్ పొడిగా చేసుకొని కట్లెట్స్ ని వాటికి అద్ది extras రాల్చేస్తూ డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్ లో చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయడం వల్ల లోపల ఉన్న స్టఫ్ కూడా బాయిల్ అవుతుంది. క్రిస్పీగా ఉంటాయి.


