Black Rice benefits in telugu :ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి ఎన్నో పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆహారాలలో నల్లబియ్యం కూడా ఒకటి.
నల్ల బియ్యంలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండు సార్లు నల్ల బియ్యం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నల్ల బియ్యంలో విటమిన్ ఈ చాలా సమృద్ధిగా ఉంటుంది.
అలాగే నియాసిన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, జింక్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును బయటకు పంపడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


