బియ్యం పిండితో చేసే పెసరపప్పు చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. ఈ చెక్కలు కరకరలాడుతూ మంచి రుచిలో రావాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.
కావలసిన పదార్థాలు
బియ్యపు పిండి - 1 కిలో
పెసరపప్పు - 1/4 కిలో (పొట్టు లేనివి)
డాల్డా లేదా వెన్న - 200 గ్రాములు
అల్లం - 50 గ్రాములు
పచ్చి మిరపకాయలు - 6
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 3/4 కిలో
తయారీ విధానం
పెసరపప్పును శుభ్రంగా కడికి ఒక గంట నానబెట్టాలి. అల్లం,పచ్చిమిర్చి లను మిక్సీ చేయాలి. బియ్యపిండిని జల్లించాలి. ఒక బౌల్ తీసుకోని దానిలో బియ్యపిండి,నానబెట్టిన పెసరపప్పు, అల్లం,పచ్చిమిర్చి మిశ్రమం,డాల్డా లేదా వెన్న,జీలకర్ర,ఉప్పు వేసి అవసరమైన నీటిని ఉపయోగించి బాగా కలపాలి.
ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా( చిన్న నిమ్మకాయంత) చేసుకోవాలి. ఈ ఒకొక్క ఉండను ప్లాస్టిక్ పేపర్ పై పెట్టి అప్పడంలా(చెక్క) వత్తాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగాక పైన తయారుచేసుకున్న చెక్కలను గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిస్తే కరకరలాడే పెసరపప్పు చెక్కలు రెడీ.


