Diabetes Care:ప్రపంచంలో సగం మందిని వణికిస్తున్న ఆరోగ్య సమస్యలలో షుగర్ వ్యాది ఒకటి. వయస్సుతో సంబంధం లేకుండా మనుషులను పట్టి పిడుస్తూ ఉంటుంది. ప్రతి ఆరోగ్య సమస్యకు ఓ పరిష్కాం ఉన్నట్టే దీనికి పరిష్కారం ఉంది. అయితే షుగర్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం కన్నా అది రాకుండానే ముందుగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
తాజా ఆకుకూరలు,కూరగాయలను ఆహారంలో చేర్చుకోవటం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. వీటిని తీసుకోవటం వలన శరీరానికి కావలసిన పోషకాలు లభించటంతో పాటు,షుగర్ వ్యాది రాకుండా కొంత వరకు జాగ్రత్త పడవచ్చు.
కొవ్వు తక్కువ ఉన్న పాలు, చేపలు,పాలధారిత ఉత్పత్తులను అధికంగా తీసుకోవాలి.
బియ్యం స్థానంలో దంపుడు బియ్యాన్ని అలవాటు చేసుకోవటంతో పాటు,తృణ దాన్యాలు, గింజలను కూడా తీసుకోవటం వలన షుగర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
అధిక క్యాలరీలు,ఎక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్దాలకు దూరంగా ఉండాలి.
రోజు మొత్తం మీద తీసుకొనే ఆహారంలో ప్రోటిన్స్,కార్బో హైడ్రేట్స్ సమంగా ఉండేలా చూసుకోవాలి.
వ్యాయామం
షుగర్ వ్యాదిని తప్పించుకోవటానికి వ్యాయామం తప్పనిసరి. రోజు ఉదయం నిద్ర లేవగానే అరగంట వాకింగ్,స్విమింగ్,డాన్స్ వంటివి చేయాలి.
జిమ్ లో చేరటం ద్వారా మరింత మంచి పలితాన్ని పొందవచ్చు. జిమ్ కి వెళ్ళలేని వారు ట్రైనర్ పర్యవేక్షణలో ఇంటిలోనే ప్రతి రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి.
ఏరోబిక్ వ్యాయామం లేదా దానికి సమానమైన మరో వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవటం ద్వారా షుగర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.
సహజసిద్దమైన పద్దతులు
ఉల్లిపాయను,వెళ్లుల్లిపాయను ఆహారంలో చేర్చుకోవటం ద్వారా షుగర్ రాకుండా చూసుకోవచ్చు.
కూరలలో వాడే దాల్చిన చెక్క కూడా షుగర్ రాకుండా అడ్డుకుంటుంది. ప్రతి రోజు ఒక చిన్న ముక్కను తినటం అలవాటు చేసుకుంటే మంచిది. డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ - ఇ తీసుకోవాలి.


