Belly Fat Control:ఈ రోజుల్లో మారిన జీవన శైలి, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినటం వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో అధిక బరువు సమస్య, అధిక కొలెస్ట్రాల్ సమస్య అనేవి ముఖ్యమైనవి.
ఈ సమస్య నుంచి బయటపడటానికి మనం ప్రతి రోజు తీసుకొనే పళ్ళు చాలా బాగా సహాయపడతాయి. మనం సాధారణంగా బొప్పాయి పండు తిని గింజలను పాడేస్తూ ఉంటాం. ఆ గింజల్లో పాషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగానే ఉంటాయి,
బొప్పాయి గింజలను మనం ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడతాయి. మనకు ఆన్లైన్ స్టోర్స్ లో కూడా లభ్యమవుతాయి. శరీరం నుండి విషాలను బయటకు పంపుతాయి .ఈ విత్తనాలు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే బరువు చాలా వేగంగా తగ్గుతారు.
ఈ పండులో ఉండే గింజలలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్ మరియు పాలీఫెనాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అత్యంత శక్తివంతమైనవి. కాబట్టి శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
ఈ గింజల్లో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది . బొప్పాయి గింజల పొడి ఆన్లైన్ స్టోర్ లో లభ్యమవుతుంది.
లేదంటే బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని తీసుకోవచ్చు. ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయాన్ని వాడే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణున్ని సంప్రదించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


