Betel Leaves : తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం సాధారణంగా తమలపాకును పూజలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి తమలపాకులో ఉన్న ప్రయోజనాలను తెలుసుకొని వాడకం చాలా ఎక్కువ అయింది.
ప్రతిరోజు ఉదయం ఒక చిన్న లేత తమలపాకును నమిలి తింటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తమలపాకులో ఉన్న గుణాలు ఆకలి లేని వారిలో ఆకలిని పెంచుతాయి. అలాగే కడుపునొప్పి, అల్సర్ వంటి వాటిని తగ్గిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బరువు తగ్గించడానికి మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి తమలపాకు చాలా బాగా సహాయపడుతుంది.
కీళ్ల నొప్పులు ఉన్నవారు తమలపాకులను మెత్తని పేస్ట్ గా చేసి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. నోటి దుర్వాసన సమస్య ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనం కనబడుతుంది.
తలనొప్పిగా ఉన్నప్పుడు తమలపాకు రసాన్ని నుదురు మీద రాసి సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. తమలపాకులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. రోజు ఒక చిన్న తమలపాకును తింటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


