ఒక కప్పు సేమియ, నాలుగు కప్పులు పాలు రెండు కప్పుల నీళ్లు..లేదంటే మొత్తం పాలు అయినా తీసుకోవచ్చు. గుప్పెడు జీడిపప్పు , కొంచెం కిస్మిస్, రెండు స్పూన్లు నెయ్యి ,ముప్పావు కప్పు పంచదార, ఇలాచి పౌడర్.
చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో చిక్కని పాలు తీసుకొని stove మీద పెట్టుకోండి .వేరొక పొయ్యి మీద ఒక పాన్ తీసుకొని పాయసానికి కావాల్సినవి వేపుకోండి. రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక గుప్పెడు జీడిపప్పు వేయించుకోండి. తర్వాత కిస్మిస్ కూడా వేసుకోండి .రెండు వేగిన తర్వాత పక్కకు తీసుకోండి.
అందులోనే సేమ్యాని కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో వేగించుకోవాలి. ఇప్పుడు పాలు కూడా ఒక పొంగు రానిచ్చి ఆఫ్ చేసేయండి ఒక కప్పు పాలు వరకు పక్కనుంచుకొని మిగిలిన పాలు సేమియాలో పోసేసి నెమ్మదిగా కలుపుకోవాలి.
అంటకుండా చుట్టూ చివర్లు కలుపుతూ ఉండాలి. సేమియా ఉడికే వరకు ఆ పాలతో మరిగించుకోండి. సేమియా సాఫ్ట్ గా ఉడికిన తర్వాత పంచదారని కలపాలి. ముందుగా వేస్తే సేమియా ఉడకదు. రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని, stove ఆఫ్ చేసేయండి.
ఇప్పుడు దాంట్లో వేయించిన జీడిపప్పులు, ఇలాచీ పౌడర్, పక్కన ఒక కప్పు పాలు పెట్టాం కదా వాటిని కూడా కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టేయండి. తర్వాత పాలు కలపడం వల్ల సేమియా గట్టిపడదు. ఇలా ఈజీగా పాయసం చేసుకోండి.


